Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న రాష్ట్ర, జిల్లా కమిటీ ప్రముఖులు
నవతెలంగాణ-చర్ల
మండల వ్యాప్తంగా ఉన్న సమస్యల పరిష్కారం, పార్టీ నిర్మాణం, నూతన కమిటీల ఎంపిక మొదలగు అంశాలపై నేడు సిపిఎం పార్టీ మండల మహాసభ జరగనున్నట్లు మండల కార్యదర్శి కొండ చరణ్ తెలిపారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరగవలసిన మండల మహాసభ ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ లో గల శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు వివరించినట్లు ఆయన తెలిపారు. 2017లో జరిగిన మండల మహాసభ తిరిగి 2020లో జరగవలసి ఉండగా కరోనా కారణంగా ఈరోజు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ మహాసభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ మీడియం బాబురావు, పోతినేని సుదర్శన్, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు అన్నవరపు కనకయ్య, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎజే రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రవికుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె బ్రహ్మచారి పాల్గొని పలు విషయాలపై ప్రసంగించనున్నారు. ఈ రోజు జరిగే మహాసభకు సిపిఎం పార్టీ చర్ల మండల కమిటీ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. పార్టీ మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ఆగ్జలరీ శాఖ కార్యదర్శులు, సభ్యులు అందరూ సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.