Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తు కేజీబీవీ యూనియన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పెద్దతండా కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయం ఎదుట గురువారం విశ్రాంత సమయంలో ఆందోళన చేశారు.ఈ సందర్భంగా కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆవుల అశోక్ మాట్లాడారు. ప్రభుత్వం కేజీబీవీ వర్కర్స్ విషయంలో సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు.కేజీబీవీ వర్కర్స్ కు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు .కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వర్కర్స్ పాల్గొన్నారు.