Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ -పెనుబల్లి
కమ్యూనిస్టులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలపడితేనే దేశానికి భద్రత ఉంటుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని లంకపల్లి గ్రామంలో మూడ్ మోతియ నగర్లో జరిగిన సీపీఎం మండల 8వ మహాసభలో పాల్గొని కళ్యాణం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు అమ్ముకుంటున్నారని, పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వమంటే కేసులు పెడుతూ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నరని విమర్శించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతముగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచే పని మోడీ సర్కారు చేస్తుందని, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం తందానా అంటూ మోడీకి వంత పాడుతుందన్నారు. ఎర్ర జెండాలను అధికారంలోకి తెచ్చుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందన్నారు. తొలుత గ్రామంలో మండల కార్యదర్శి చలమాల విఠల్రావు ఆధ్వర్యంలో మండల జాతీయ రహదారి మీదుగా భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించి మహాసభ ప్రాంగణంలో ప్రారంభ సూచికంగా సీపీఎం సీనియర్ నేత మూడు దూప్ సింగ్ జెండా ఆవిష్కరణ చేశారు. సీపీఎం పెనుబల్లి మండల నూతన కార్యదర్శిగా గాయం తిరుపతి రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో సీపీఎం జిల్లా నేతలు మాచర్ల భారతి, తాతా భాస్కరరావు, మోరంపుడి పాండు రంగారావు, జాజిరి శ్రీనివాస్, రావుల రాజబాబు, మామిళ్ల వెంకటేశ్వర్లు, తాండ్ర రాజేశ్వరరావు, అర్వపల్లి జగన్మోహన్రావు, తిరుపతిరావు, చలమాల నరసింహారావు, రాజారావు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.