Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ)తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని నాయుడు పేట బైపాస్ వద్ద గల కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కస్తూరిబా విద్యాసంస్థలు పున:ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు టీచర్లు నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.కనీస స్కావెంజర్లను కూడా నియమించలేదని దీంతో పారిశుధ్యం లోపించి విద్యార్థులకు అంటూ రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేసిన ఆ స్థాయిలో టీచర్లు, సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. పాఠశాలకు, కళాశాలకు వెంటనే బడ్జెట్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలకు పేద విద్యార్థులపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు.ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ ని వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు.సంఘం జిల్లా కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాలల, కళాశాలల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వెంటనే బడ్జెట్ విడుదల చేసి మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మధు, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సంగీత, కల్పన రోజా తదితరులు పాల్గొన్నారు.