Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఆదివాసీలు ఏకతాటిపై ఉండి, కొమరం భీం ఆశయాలను సాధించాలని స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రములో కొమరం భీం 81వ వర్ధంతి సభ పాయం రమేష్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడారు. కొమరం భీం మరణించిన ఆయన అందించిన స్ఫూర్తి మనలో శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, సాంబశివరావు, ఏఈడబ్ల్యూసీఏ జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణయ్య, చాట్ల శ్రీనివాసరావు, జోగ రాంబాబు, వి.చంద్రయ్య దొర, సురేష్, నాగరాజు, కిషోర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి : కొమరం భీమ్ వర్ధంతి కార్యాక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం అవరనంలో శుక్రవారం సర్పంచ్ తాటి పద్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మండల ఉపాధ్యక్షులు ఆదివాసీ నాయకులు, పూణెం శ్రీనివాస్ మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకన్న, ఉపసర్పంచ్ నాగమణి, ఎంపీటీసీ తేజవత్ భద్రమ్మ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.