Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్ఎఫ్సీ, 15వ ఆర్ధిక సంఘం నిధుల వినియోగం సక్రమంగా జరగాలని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య అన్నారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో అన్ని మండలాల ఎంపీడీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మెన్ కనకయ్య మాట్లాడారు. ఎంపీడీఓ, ఎంపీటీసీ, సర్పంచ్ల గౌరవ వేతనాలు సకాలంలో విడుదల చేయాలని కోరారు. జేపిఎస్, ఓపీఎస్ నెల వారి జీతభత్యాలు, ప్రతి నెల సకాలంలో బిల్లులు చెల్లించుట గురించి చర్చించారు. మండల ప్రజా పరిషత్‌కు విడుదలైన సర్దుబాటు గ్రాంటు, మండలంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి, ఉపాధిహామీ పనులలో కూలీలకు ఎక్కువ పనులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ జిల్లా ముఖ్య కార్యనిర్వహణాధికారి మెరుగు విద్యాలత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి యం.మధుసూధన రాజు, ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారి బి.నాగలక్ష్మి, తెలంగాణా మండల పరిషత్ అభివృద్ధి అధికారుల జిల్లా సంఘ అధ్యక్షులు యం.రామారావు, కె.వీరబాబు, ప్రధాన కార్యదర్శి కోశాధికారి, అప్పారావు, సభ్యులు నాగేశ్వరరావు, డి.అన్నపూర్ణ, జిల్లాలోని వివిధ మండల పరిషత్ అభివృద్ది అధికారులు పాల్గోన్నారు.