Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్ ఇండియా ఆఫీస్ ముందు ధర్నాను విజయవంతం చేయండి
నవతెలంగాణ-కొత్తగూడెం
నవంబర్ 15న కొల్కత్తలోని కోల్ ఇండియా ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర ఉపాద్యక్షులు యన్.సంజీవ్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం ఇఫ్య్టూ కార్యాలయంఓ ఏరియా అధ్యక్షులు పెద్దబోయిన సతీష్ అధ్యక్షతన ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు 11వ వేతన ఒప్పందంలో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి క్యాటగిరి వేతన ఒప్పందం చేయాలని డిమాంతో కోల్ ఇండియా భవనం ముందు ధర్నా తల పెట్టడం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా విప్లవ కర కాంట్రాక్టు కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి తెలిపారు. సమావేశంలో ఇఫ్య్టూ ఏరియా అద్యక్షులు పి.సతీష్, బ్రాంచి నాయకులు సిహెచ్.సమ్మయ్య, కృష్ణ, కె.అజమ్, రాధ, నర్సింహా, కరుణ, మరియ్య, నాగలక్మి పాల్గొన్నారు.