Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్థేశిత గడువులోగా పూర్తి చేయాలి
- ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు
నవతెలంగాణ-భద్రాచలం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులు వేగం పెంచి ప్రమాణాలతో నిర్దేశిత గడువు డిశంబర్లోగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశం హాలులో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఈలు, ఏఈలతో ఇంజనీరింగ్ నిర్మాణ పనులపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ సెంటర్లు (ఆరోగ్య ఉపకేంద్రాలు) నవంబర్ 30లోగా పూర్తి చేసి సంబంధిత వైద్య, ఆరోగ్యశాఖల వారికి అప్పగించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్ని స్కూల్, (ఈఎమ్ఆర్ఎస్) దమ్మపేట, కొత్తగూడెం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఐటీడీఏ ద్వారా సబ్లోన్లో మంజూరు అయిన తారురోడ్లు, బీటీ రోడ్లు డిశంబర్ 30 కల్లా పూర్తిచేయాలని, లేనిచో ఆ బ్లాక్ లిస్టులో పెట్టాలని సంబంధిత అధికారులను పీఓ ఆదేశించారు. కమ్యూనిటీ భవనాలు (గిరిజన భవనాలు) డిశంబర్ 30 కల్లా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్లను డిశంబర్ 30 కల్లా పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ అధికారి ఈఈ రాములు, భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లందు డీఈలు, అన్ని మండలాల ఏఈలు పాల్గొన్నారు.