Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెట్లు-వరండాలే తరగతి గదులు
- అసౌకర్యాలు నడుమ బోధన
నవతెలంగాణ-అశ్వారావుపేట
కరోనా లాక్ డౌన్ అనంతర సామాజిక మార్పుల ప్రభావానికి వేగంగా గురైంది వైద్యం తర్వాత విద్యారంగమనే చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక విద్యార్ధుల చేతికందే నిదర్శనం. కరోనాకు ముందు ప్రైవేట్ విద్య అంటే సామాన్యులకు అదో ''అందని ద్రాక్ష పుల్లన'' లాంటిది. కరోనా అనంతరం ఊరి బడే క్షేమకరం అనే పరిస్థితి ప్రతీ తల్లిందండ్రులలోనూ ఏదో కొత్త మార్పుకు నాంది పలికింది. దీంతో ఒకప్పుడు అరకొర పిల్లలతో కొన ఊపిరితో కొట్టుకున్న ఊరు బడులు నేడు సామర్ధ్యం మించి పిల్లలు చేరికతో కలకల్లాడుతున్నాయి.
విషయానికొస్తే.... పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని నారం వారి గూడెం ప్రాధమికోన్నత పాఠశాలలో విద్యార్ధులకు చెట్లు నీడలు, వరండా అరుగులే తరగతి గదులు. అసౌకర్యాల నడుమ ఇక్కడ విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. మండలంలోనే అత్యధిక విద్యార్ధిని, విద్యార్ధులున్న ప్రాధమికోన్నత (యూపీఎస్) పాఠశాలల్లో రండో పాఠశాలల ఇది. ఒకటి నుండి ఎనిమిది తరగతులు వరకు 173 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. కానీ మూడు భవనాలు నాలుగు గదులు మాత్రమే ఉండటంతో మిగతా నాలుగు తరగతులు చెట్లు నీడలు, వరండా అరుగులే వీరికి గదులుగా మారాయి.
ఈ పాఠశాలలో సంవత్సరాలు వారీగా విద్యార్ధుల పెరుగుదల.....
2018 - 2019 85
2019 - 2020 101
2020 - 2021 135
2021 - 2022 173
ఈ పాఠశాలకు 10 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా 8 మంది ఉపాధ్యాయుల పోస్టులు మాత్రమే నింపారు. ప్రస్తుతం ఈ ఎనిమిది మందిలో ఒకరు మెడికల్ లీవ్‌లో ఉండగా, ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్ళారు. కాగా గణితం, హింది సబ్జెక్టులు బోధకులు లేరు. రాష్ట్రమంత్రి వర్యులు పువ్వాడ అజరు కుమార్ సైతం ఈ పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పాఠహాజరు అయిన సందర్భంగా ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్లు ఆ గ్రామానికే చెందిన ఓ మండల స్థాయి తెరాస కీలక నేత ఒకరు అప్పట్లో చెప్పుకున్నారు. ఈ పాఠశాలకు తక్షణమే అదనపు తరగతి గదులు మంజూరీ చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.