Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-మణుగూరు
పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో నోడల్ అధికారులు ఎటువంటి రాజకీయ జోక్యానికి అవకాశం ఇవ్వద్దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం స్థానిక శ్రామిక భవనంలో జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 2006 అటవి హక్కు చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 వరకు సాగుచేసుకుంటున్న పోడు రైతులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. పోడుసాగుదారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని అన్నారు. పోడుపంటల విధ్వంసం, కందకాల తవ్వకాలు నిలిపివేయాలన్నారు. గ్రామసభ నిర్వహించి నూతన పోడుసాగుదారుల దగ్గర నుండి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు 2014 జూన్ ప్రతిపాదికగా అటవి హాక్కుల చట్టం అమలు చేసి పోడు రైతు లందరికి హాక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. అటవి హాక్కు చట్టం నీరు కార్చడానికి మోడీ ప్రభుత్వం నూతన అటవివిధానం 2019 ద్వారా తెచ్చిన ప్రమాదకర సవరణలు రద్దు చేయాలని డిమాండు చేశారు. వన సంరక్షణ సమితులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఆ పోడు సాగుదారులకు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్, జిల్లా కమీటీ సభ్యులు నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.