Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర నాటకోత్సవాలు
- 20 ఏండ్ల భద్రాద్రి కళాభారతి
నవతెలంగాణ-భద్రాచలం
కళలకు ఊపిరి పోస్తూ.. నాటక రంగాన్ని బతికిస్తూ...నేటి తరానికి పరిచయం చేస్తూ.. భద్రాచలానికి మరింత వన్నె తెస్తోంది భద్రాద్రి కళాభారతి..వివిధ కళారం గాల్లో, సినీ, బుల్లితెర, నాటక రంగాలకు చెందిన ఎందరో కళాకారులను భద్రాద్రికి తీసుకొచ్చి వారిని సన్మానించి సత్కరిస్తుంది భద్రాద్రి కళాభారతి... గత 20 ఏండ్లుగా భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాటక సంబరాలు నేటి నుంచి రెండు రోజుల పాటు భద్రాచలంలో జరుగను న్నాయి. 21వ వసంతంలోకి భద్రాద్రి కళాభారతి అడుగులు వేస్తున్న క్రమంలో అంతరాష్ట్ర నాటక సంబరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఆర్టీసీ చిరు ఉద్యోగులతో ప్రారంభమై..
భద్రాచలం ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న చిరుద్యోగుల ఆలోచనతో భద్రాద్రి కళాభారతిగా ప్రాణం పోసుకుంది. ఈ భద్రాద్రి కళాభారతి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న అల్లం నాగేశ్వరరావు కళాకారుడుగా తన అనుభవంతో ,తన తోటి ఉద్యోగులు, కళాకారులైన నర్సింహారావు, రామరాజు శ్రీనివాస్, ప్రతాప్, తిరుపతి, పులిరాజులతో కలిసి ఈ నాటక సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నాటిక, నాటక రంగాల్లో కళాకారులను తీర్చిదిద్దాలనే 2001, ఆగస్టు 21న భద్రాద్రి కళాభారతి సంస్థను ప్రారంభించి, నాటి నుంచి ప్రతి ఏడాది భద్రాచలంలో నాటకోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
2003 నుంచి అంతర్రాష్ట్రస్థాయి పోటీలు మొదలై...
కళారంగాన్ని ప్రోత్సహించే భద్రాచలానికి చెందిన ప్రముఖుల ఆర్థికసాయంతో భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో భద్రాచలం ప్రత్యేక స్థానం సంతరించుకుంది. ఈనేపథ్యంలో 2003 నుంచి అంతర్ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు నిర్వహిస్తూ, ఉత్తమ నాటికలకు, ఉత్తమ కళాకారులకు నగదు, జ్ఞాపికలు అందిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే భద్రాద్రి కళాభారతి ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఈ కళాభారతి ఆధ్వర్యంలో సుమారు 100కు పైగా నాటికలు ప్రదర్శనలు, జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, మిమిక్రీ, ఇంద్రజాలం వంటి ప్రదర్శనలతో నాటి నుంచి నేటి వరకు అలరిస్తున్నారు. నాటకోత్సవాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల కళాకారులు ఈ నాటిక సంబరా ల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటు లను భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో సత్కరిస్తున్నారు. కళా తపస్వి దర్శకుడు కె.విశ్వనాథ్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ నటులు నూతన ప్రసాద్, కేకే.శర్మ, గుండు హనుమంతురావు, తనికెళ్ల భరణి, తెలంగాణ శకుంతల, జయప్రకాశ్ రెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, చంద్రబోస్, గజల్ శ్రీనివా స్, శివ శంకర్ మాస్టర్, ఝాన్సీ, కొండవలస లక్ష్మణరావు వంటి ఎందరో కళాకా రులను భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, సత్కరించారు.
నేటి నుంచి 20వ నాటకోత్సవాలు..
కరోనా కారణంగా భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్రాష్ట్ర నాటక సంబరాలను ఈ నెల 30, 31 తేదీల్లో భద్రాచలంలో 20వ నాటకోత్స వాలు రెండు రోజులపాటు నిర్వహించను న్నారు. భద్రాచలంలోని బీసీఎస్ఆర్ గార్డెన్లో ఈ అంతర్రాష్ట్ర నాటక పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రముఖ సినీ దర్శక, నిర్మాతలు తమ్మారెడ్డి భరధ్వాజ్, ఆర్.నారాయణమూర్తిలను సత్కరించనున్నట్టు ్వహకులు తెలిపారు. అదేవిధంగా జానపద, నాటికలు, మిమిక్రీ, ఏకపాత్రాభినయం, తదితర ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ప్రముఖుల సహకారం మరువలేనిది..
ఆర్టీసీ సంస్థలో చిరుద్యోగులు గా పనిచేస్తున్న తమకు వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఈ భద్రాద్రి కళాభారతి. భద్రాచలానికి చెందిన ప్రముఖుల సహకారం వల్లే 20 ఏళ్లుగా ఈ కళాభారతి నిర్విరామంగా నిర్వహిస్తున్నాము. కళాభారతి ఇరవై వసంతాలు దాటుటకు భద్రాచలానికి చెందిన ప్రముఖుల దాతృత్వం, కళా రంగం పట్ల వారికి ఉన్న మమకారం వల్ల ఈ కళాభారతి కొనసాగుతోంది. వర్ధమాన నటీనటులను వెలుగులోకి తేవ టం,పలు రంగాల్లో నిష్ణాతులైన వారిని సత్కరించటం కళారంగంలో నాటిక, నాటకాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావటం మా సంస్థ ప్రధాన లక్ష్యం.
- అల్లం నాగేశ్వరరావు, భద్రాద్రి కళాభారతి వ్యవస్థాపక అధ్యక్షులు