Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాసాని ఐలయ్య
నవతెలంగాణ-సుజాతనగర్
గిరిజనులకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇచ్చి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కంగాల బుచ్చయ్య నగర్లో సుమారు 150 మంది గిరిజనులు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, వీరికి తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి కనీస మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీరికి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జే.కృష్ణ, లక్ష్మిదేవిపల్లి మండల కార్యదర్శి యు.నాగేశ్వరరావు, కాట్రాల తిరుపతిరావు, బందా శీను, నాగరత్నమ్మ, నాగమణి, కళావతి, నవీన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.