Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలి
- డీఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా
- శ్రామిక మహిళా (సీఐటీయూ) జిల్లా కార్యదర్శి జి.పద్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
సెర్ప్‌లో నిర్వహిస్తున్న ఎస్‌హెచ్‌జి లైవ్ మీటింగు రద్దు చేయాలని, లైవ్ మీటింగుల వల్ల విఓఏలు అనేక ఇబ్బందులు పడుతున్నరని, తక్షణమే లైవ్ మీటింగులు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని (సిఐటియు) శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి జి.పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వీఓఏలా సమస్యలు పరిష్కరించాలని స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ఐకేపీ, డిఆర్డిఏ కార్యలయం వరకు భారీ ర్యాలీ చేశారు. దారి పొడుగునా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డిఆర్డిఎ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలేష్‌కి అందజేశారు. ఆయన స్పందిస్తూ నెట్ బ్యాలన్సు, నెట్ సౌకర్యం ఉండే సిమ్‌కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. నెట్ లేక ఇబ్బంది ఉన్న గ్రామాల వాళ్ళకి ఏం చేయాలనేది ఆలోచిస్తామన్నారు. ఈ సందర్భంగా జి.పద్మ మాట్లాడుతూ వివోఏలు ఎస్ఎస్జి లైవ్ మీటింగ్‌లో లాగిన్ అవ్వాలి, లావాదేవీలు సమావేశం నిర్వహించడం సభ్యుల, వివరాలు డేటా ఎంట్రీ గ్రూపు సభ్యుల వివరాలు మొత్తం చేయడం కోసం దాదాపు 2 రెండు గంటల టైం పడుతుందన్నారు. సభ్యులు ఉండే పరిస్థితి లేదు. గ్రామాల్లో నెట్ సౌకర్యం లేదు. సెల్ ఫోన్లు లేవు, ట్యాబ్‌లు, నెట్ బ్యాలెన్స్ లేదు, ఎలా లైవ్ మీటింగ్ పెడతామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నెట్ సౌకర్యం లేక లాగిన్ అవ్వకపోతే గ్రేడింగ్ పద్ధతులు తీసుకొచ్చి జీతాలు ఇవ్వమని అధికారులు చెప్పడం సరైనది పద్ధతి కాదన్నారు. అధికారులు చేయవలసిన పని కూడా వివోఏలతో చేయించడం వీఓఏలను బెదిరింపులకు గురి చేయడం సరికాదని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.5 వేలు ఇస్తున్నామని రూ.3,000లు ఇస్తూ మిగతాది గ్రామ సంఘంలో రూ.2000వేలు తీసుకోమని చెప్పడం ఇది ప్రభుత్వ మోసపూరిత ఆలోచనని ఆరోపించారు. పెరిగిన ధరలతో పోలిస్తే మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదని వివోఏలకు రావలసిన గౌరవ వేతనం నేరుగా విఓఏలా అకౌంట్లోనే వేయాలని, కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని లైవ్ మీటింగ్‌ను రద్దు చేయాలని, జీవో నెంబర్ 58 సవరించాలని వివోఏలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ప్రమాద బారినపడి వివోఏలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ల్యాబ్టాప్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎర్రగాని కృష్ణయ్య, తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి అరుణ, వెంకటేశ్వర్లు, హరిబాబు, చంద్రలీల, నాగరాజు, సత్యవాణ,ి సత్యనారాయణ, మంగ, అప్పారావు, నఫీజ్, ప్రసాద్, చరణ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.