Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సురక్షాబస్టాండ్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పరిశీలించారు. శుక్రవారం మణుగూరు మున్సిపాలీటీ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే ఉన్నా సురక్షాబస్టాండ్ నిర్మాణ పనులు సుమారు రూ.70 లక్షలతో అత్యాధునికరంగా నిర్మిస్తున్న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ నాణ్యతతో నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డీఎం, జడ్పిటీసీ పోశం నర్సింహారావు, పట్టణ అధ్యక్షులు అడపా .అప్పారావు, కార్యదర్శి నవీన్, కాంట్రాక్టరు లక్ష్మయ్య, యాదగిరిగౌడ్, మండల కార్యదర్శి రామిడి, రాంరెడ్డి, శ్రీను, ఆర్టీసి అధికారులు పాల్గొన్నారు.