Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేట పోలీస్ స్టేషన్ను తొలిసారి సందర్శించిన ఏఎస్పీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
ప్రేమ పెండ్లి విషయంలో దళితుడైన తనపై దళితేతరులు కొందరు దాడి చేసారని అశ్వారావుపేటకు చెందిన జీవా ఇటీవల పలువురిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ అరుణ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఈ కేసుపై శుక్రవారం పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజు విచారణ చేపట్టారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సాధారణ సందర్శనలో భాగంగా ఆయన అట్రాసిటీ కేసుపై బాధితులు జీవా గృహానికి వెళ్లి కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారిని విచారించారు. వీరివెంట సీఐ ఉపేంద్రరావు, ఎస్సైలు అరుణ, రామ్మూర్తి, ఏఏఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు.