Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
సైబర్ నేరాలపై అవగాహన పెరిగిపోతున్నా టెక్నాలజీకి తగ్గట్టుగానే సైబర్ నేరాలు విజృంభిస్తున్నాయని సిఐ తుమ్మ గోపి అన్నారు. శనివారం నగరంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటి)కాలేజ్ విద్యార్థులకు సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో ఖమ్మం అర్బన్ సిఐ రామకృష్ణ, సిఐ తుమ్మ గోపిలు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ తరహా నేరాల్లో మనుషులు కనిపించరు, వారి గొంతూ వినిపించదు, కానీ ఘోరాలు జరిగిపోతుంటాయన్నారు. ఖాతాల్లోని డబ్బులు దోచుకోవడమే కాకుండా... ఫోన్లలోని రహస్య సమాచారాన్ని సైతం తస్కరిస్తారన్నారు. అవగాహనలేమి కారణంగా వ్యక్తిగత గోప్యత, భద్రత కోల్పోతున్నారన్నారు.సైబర్ మోసానికి గురైన ఎవరైనా సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 155260 కు డయల్ 100కు చేయవచ్చు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో సంఘటనను నివేదించవచ్చ తెలిపారు. ఈకార్యక్రమంలో సైబర్ క్రైమ్ఎస్సై రంజిత్ కుమార్ పాల్గొన్నారు.