Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
మండలంలోని పోలేపల్లి పంచాయతీలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని సిపిఎం మండల నాయకులు నందిగామ కృష్ణ డిమాండ్ చేశారు. పోలేపల్లి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం కొండం కృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ పోలేపల్లిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ నిరుపయోగంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు జోక్యం చేసుకుని అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలేపల్లి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో దండగల రాంబాబు, మద్ది వెంకటరెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.