Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్
రైతులకు వరి విత్తనాలను ప్రభుత్వమే అందించి, పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో బీటిఆర్ భవన్లో సిపిఎం జనరల్ బాడీ సమావేశం వేగినాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం నిర్వహిం చారు. సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వరి పంట వేయవద్దని ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. వరి విత్తనాలు అమ్మితే షాప్లు సీజ్ చేస్తామని బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రంజాన్ పాషా, యార్రా నరసింహారావు, ఐద్వా మండల కార్యదర్శి పెండ్యాల సుమతి, గజ్జి పట్టాభి, గొడ్డేటి రాజేశ్వరి, సిరికొండ నగేష్, పాము ఉపేందర్, బోడపట్ల శ్రీను, బోళ్ల ఉష తదితరులు పాల్గొన్నారు.