Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకొచ్చిన దాతలు...నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-ముదిగొండ
చిరుమర్రి గ్రామానికి చెందిన యడవల్లి సైదులుకు రెండు కిడ్నీలు చెడిపోయి వైద్య చికిత్స కోసం డబ్బులు లేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో పలువురు దాతలు శుక్రవారం 60 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సైదులు దీనపరిస్థితిపై నవతెలంగాణ దినపత్రికలో ఈనెల28న''దాతల కోసం ఎదురు చూపు''.అనే కథనం ప్రచురించిన విషయం విదితమే.ఈ కథనానికి చలించి ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండస్వామి రూ10వేల ఆర్థిక సహాయం అందజేశారు. చిరుమర్రి గ్రామానికి చెందిన పలువురు దాతలు కోలేటి ఉపేందర్, చావాగాని మాధవరావు, చెరో పది వేలు ఆర్థిక సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మేడా రామయ్య రూ5,500 అందజేశారు. చిరుమర్రి గ్రామానికి చెందిన బండి శేఖర్, సైదులు, ఫ్రెండ్స్ యువత రూ22,500 వేలు వితరణ చేశారు. మొత్తం రూ60వేల రూపాయలు సైదులు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు పలువురు అభినందనలు తెలిపారు.