Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేదు
- పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం
- విలేకర్ల సమావేశంలో కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భూ రికార్డ్ల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో దేశానికే ధరణి ప్రాజెక్టు ఆదర్శంగా నిలిచినట్లు, రికార్డుల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం లేదని, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. ధరణి ప్రాజెక్టు ప్రారంభమై సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కేక్ కట్ చేసి రెవిన్యూ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం జరిగిందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారంనకు పోర్టల్ అందుబాటులోకి తేవడంపై ముఖ్యమంత్రి కేసిఆర్‌కి, సీఎస్ సోమేశ్ కుమార్‌కి, శేషాద్రికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా భూ రికార్డ్ల నిర్వహణ కోసం ధరణి పోర్టల్‌ను 29 అక్టోబర్ 2020న రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ప్రారంభించారని చెప్పారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం కార్యకలా పాలను నిర్వహించామన్నారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని వివరించారు. ప్రజలు ధరణి సేవలను ఉపయోగించు కోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విలేకర్ల సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.