Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
ధరణిలో నెలకొని ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ డి.పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆ భూములను కాపాడాలని కోరారు. శ్రీ రామ్‌సాగర్, భక్త రామదాసు, తానంచర్ల వరద కాలువ తవ్వకాలలో ఒక కుంట భూమి పోయినా...అలాగే ఏదైన సర్వే నెంబర్లో కోర్టు తగాదాలో ఉన్నా ఆ సర్వే నెంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుళ్లూరు నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గోపాజు రవి, నాయకులు షేక్ ఇమామ్, కోడి లింగయ్య, కొమ్ము నాగేశ్వరరావు, నేర్సుల వెంకటేష్, నరేష్, పుల్లయ్య పాల్గొన్నారు.