Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
పింజరమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వింజం నాగభూషణం, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, పార్టీ మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పిటిసి బానోతు వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, ఎంపీటీసీ రాంరెడ్డి జగన్నాథరెడ్డి, సీపీఐ మండల అధ్యక్షులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ మండల కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, గుజ్జర్లపూడి రాంబాబులు మాట్లాడుతూ పింజరమడుగు గ్రామస్తులు బుగ్గవాగుపై లిఫ్ట్ ఇరిగేషన్‌ను గత యాభై సంవత్సరాల క్రితం స్వచ్ఛందంగా రైతులంతా కలిసి నిర్మించుకున్నారని, ఆనాటి నుండి నేటి వారికి ఆయకట్టు రైతులలో ఒకరు ఛైర్మెన్‌గా ఉండి నడుపుకుంటున్నారని, కొంతమంది అధికార దాహంతో లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూమి లేని వారు తామే ఛైర్మెన్‌గా కొనసాగుతామని, లిఫ్ట్ ఇరిగేషన్‌పై ఉన్న మోటార్ల తాళాలు మోటార్లను దొంగిలించారన్నారు. తాళాలు తీసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక తాసిల్దార్కి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే ధర్నాకు దిగినట్లు తె లిపారు. తాసిల్దార్, ఎస్సై స్పందించి మూడు రోజులలో తాళాలను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో నాయకులు ఏపూరి లతాదేవి, బాదావతు శ్రీను, దమ్మాలపాటి సత్యం, లాలు, శివ, సాంబశివరావు, రాకేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.