Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ- ఖమ్మం
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య( డివైఎఫ్ఐ )ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం నుండి 7వ తేదీ వరకు త్యాగాల డివైఎఫ్ఐ జెండాను గ్రామ గ్రామాన ఎగురవేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మంచికంటి భవన్లో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ పతాకావిష్కరణ చేశారు. డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసిన అమరవీరుల స్ఫూర్తితో ఏర్పడిన సంఘం డివైఎఫ్ఐ అని ఆ త్యాగాలను కొనసాగిస్తూ దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుందని, ఆ పోరాటాలను అందుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కణతల వెంకటేశ్వర్లు, ఇంటూరి అశోక్, రాసాల నవీన్, సౌజన్య, కల్పనా, రామకృష్ణ, స్వామి, చిరంజీవి, నాగేశ్వరరావు, నాగరాజు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.