Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు తూట్లు పొడిసి, కార్మిక సంక్షేమాన్ని నీరు గారుస్తున్నాయని తెలంగాణ బిల్డింగ్, అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మ చారి అన్నారు. వెంకటేశ్వర కార్పెంటర్స్ యూనియన్ సీఐటియు జనరల్ బాడీ సమావేశం సోమవారం యూనియన్ కార్యాలయంలో అధ్యక్షులు బొద్దోజు శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డును, రక్షించు కోవటం కోసం జరుగుతున్న పోరాటాలను విజయవంతం చేయాలన్నారు. 1996 కేంద్ర చట్టానికి వలస కార్మికుల చట్టానికి చేసిన సవరణలు విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పెంటర్లకు సబ్సీడిపై కలప సరఫరాచేయాలని ఆయన అన్నారు. కార్మికుల సొమ్మునురాష్ట్ర ప్రభుత్వం కాజేసే చర్యలను ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రభుత్వం అక్రమంగా వాడుకున్న 1004 కోట్ల రూపాయలను ప్రభుత్వం తిరిగి జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత నెల 4వ తేదిన హైద్రాబాద్ ధర్నా జయప్రదమయిందని ఆ సందర్భంగా ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 36వేల క్లైమ్స్ పెండింగ్ లో వున్నాయని వాటి పరిష్కారానికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన అన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు అనుగోజు నర్సింహాచారి తన సొంత ఖర్చులతో కార్పెంటర్లకు వెల్పేర్ బోర్డులో సభ్యత్వం చేర్పించి గుర్తింపు కార్డులు ఇప్పించే కార్యక్రమాన్ని సిఐటియు నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా కమిటీ సభ్యులు యంబీ నర్సారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అనుగోజు నాగ భూషణం, కార్పెంటర్స్ యూనియన్ కార్యదర్శి అనుగోజు మధు, కోశాధికారి అప్పారి రాము పాల్గొన్నారు.