Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) దాని అనుబంధ సంఘాలు ఉద్యమించాలని ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు మాచర్ల భారతిచ కళ్యాణం వెంకటేశ్వరరావు, తాతా భాస్కరరావు, మేరుగు సత్యనారాయణ, మోరంపూడి పాండురంగారావు పార్టీ శ్రేణులను కోరారు. సోమవారం మండలంలోని గంగారం వాసు గార్డెన్లో సత్తుపల్లి రూరల్ మండల 8వ మహాసభ ఆ పార్టీ మండల సీనియర్ నాయకులు బాల బుచ్చయ్య, పాకలపాటి జగన్నాధం, పోలాసి భాగ్యమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో భారతి, వెంకటేశ్వరరావు, భాస్కరరావు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కంఠక పాలన సాగిస్తున్నాయని విమర్శిం చారు. పేద, మధ్య తరగతి ప్రజలు జీవనం సాగించలేని స్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను అదుపు చేయ డంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందా యన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం మోపారని దుయ్యబట్టారు. రైతులు స్వేచ్ఛగా తమకు ఇష్టం వచ్చిన పంటలను సాగుచేయకుండా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందన్నారు. వరివేస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని ప్రభుత్వం హెచ్చరించడం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ శక్తుల లభ్ధికోసమే వరిని పండించవద్దని హుకూం జారీచేయడం శోచనీయమన్నారు. వరిని పండించకుంటే ప్రజలు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. ఏండ్ల తరబడి చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులు, చట్టాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. బొగ్గు గనులను ప్రయివేటీకరించి కార్పొరేట్ శక్తులకు అప్పగించే పనిలో ప్రధాని మోదీ ఉన్నారన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి అన్నదాతలను రోడ్డున పడే పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. రైతు వ్యతిరేక ,ట్టాలను వ్యతిరేకిస్తూ ఏడు నెలలుగా ఢిల్లీ నడిబోడ్డున లక్షలాది మంది రైతులు కుటుంబాలతో సహా ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీకి కనికరం లేకపోవడం సిగ్గుచేటన్నారు. విత్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చి ప్రజలపై మరింత భారం మోపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ నిరంకుశ పాలనలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించకుంటే వారి ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండదన్నారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీయించే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారన్నారు. ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వాలు నొక్కుతున్నా రన్నారు. దేశంలో వామపక్ష పార్టీలు బలపడితే తప్ప ఈ ప్రభుత్వాలు దిగివచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ మహాసభలో మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు రమ్య, నాయకులు చలమాల విఠల్‌రావు, కొలికపోగు సర్వేశ్వరరావు, గాయం తిరుపతిరావు, జాజిరి జ్యోతి, తిగుళ్ల లక్ష్మి పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు గంగారంలో కళాజాత డప్పు వాయిద్యాలతో ప్రదర్శన నిర్వహించారు.
సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా జాజిరి శ్రీనివాస్
సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కార్యదర్శిగా జాజిరి శ్రీనివాస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2016 వరకు పెనుబల్లి మండల కార్యదర్శిగా పనిచేశారు. ఆ తరువాత 2017 నుంచి 2021 వరకు సత్తుపల్లి మండల కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను మరోసారి మండల కార్యదర్శిగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.