Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
లేబర్ కమిషనర్‌ను నియమించకపోవడం వల్ల దాదాపు 8వేల ఇన్సూరెన్స్ పెండింగ్ కేసులు వుండి బిల్డింగ్ వర్కర్లు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే కమిషనర్ పోస్టు భర్తీ చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శిరీషకి మెమెరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా యర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ... బిల్డింగ్ వర్కర్లకు కూసుమంచిలో అడ్డాలకు స్థలాలు కేటాయించి మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, పౌరసరఫరాల శాఖకు మళ్లించిన వెల్పేర్ బోర్డు నిధులను తిరిగి కేటాయించాలని కార్మికుల ప్రమాద బీమా రూ.10లక్షలకు, వివాహల ప్రోత్సాహకం రూ.30వేల నుండి లక్ష రూపాయలకు, కాన్పు ప్రోత్సాహకం రూ.30 వేల నుండి రూ.50 వేలకు పెంచాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఐరన్, స్టీల్, ఇసుక ధరలు తగ్గించాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్సు, కార్మికులకు పియఫ్, ఈయస్ఐ కల్పించాలని, దీనికోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని, లేకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మ విష్ణు, సీపీఎం మండల కార్యదర్శి బారి మల్సూర్, సీఐటీయూ జిల్లా నాయకులు గోపె వినరు కుమార్, మండల కన్వీనర్ పడిశాల శేషయ్య, బిల్డింగ్ వర్క్స్ మండల అధ్యక్ష కార్యదర్శులు పందిరి శ్రీను, ఆంటోటి పుల్లయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శానం కృష్ణ, నాయకులు రెపకుల ప్రసాద్, ఉపేంద్ర చారి, మంద శ్రీను, కొత్త విజరు పాల్, గోపె .బన్నీ, గోపే ఉపేందర్, ఆవుల వెంకన్న, గుత్తేటి ఉపేందర్, నాగరాజు, కొండ నర్సయ్య, చెరుకుపల్లి అర్జున్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.