Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా సమగ్ర సమాచారంతో రూపొందించిన ''ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎట్ ఏ గ్లాన్స్'' హ్యాండ్ బుక్, జిల్లా గణాంక వివరాల హ్యాండ్ బుక్-2020ను సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం, జిల్లా భౌగోళిక విస్తీర్ణం, జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారులు, జిల్లాలోని పరిశ్రమలు, పాఠశాలలు, వసతి గహాలు, రవాణా వ్యవస్థతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన వివరాలతో రూపొందించిన పుస్తకాలను సోమవారం ''గ్రీవెన్స్ డే'' సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు ''గ్రీవెన్స్ డే''లో పాల్గొన్నారు.