Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మంకార్పొరేషన్
పల్లా జాన్ రాములు 83వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక చర్చి కాంపౌండ్ కమ్యూనిటీ హాల్లో సోమవారం మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా కిరణ్ కుమార్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు వేల మందికి ప్రముఖ వైద్య నిపుణులతో ఉచిత మెడికల్ చెకప్ కూడా ఏర్పాటు చేసి వాళ్లకు కావాల్సిన మందులు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యులు కూరపాటి ప్రదీప్‌కుమార్, టిఆర్ఎస్ నాయకురాలు షకీనా తదితరులు పాల్గొన్నారు,