Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా : కెవిపిఎస్
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపియస్) ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి పాపిట్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలోని నాయుడుపేట గ్రామంలో సోమవారం కెవిపిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,100 యూనిట్ల లోపు ఉచిత కరెంటు,కేజీ టు పీజీ ఉచిత విద్య,దళితులు అందరికీ ఏకకాలంలో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు నేరుగా ఇవ్వాలని కోరారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు వెంటనే చైర్మన్ నియమించాలన్నారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు మండల కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు నుకల బాలరాజు,నందిపాటి లక్ష్మయ్య,నాగేశ్వరరావు, కస్తాల ప్రభుదాసు, రవి, శ్రీను, చిరంజీవి, సురేష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.