Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
పోలీసులకు, కార్యకర్తల మధ్య తోపులాట
నవతెలంగాణ- ఖమ్మం
వరి విత్తనాల అమ్మకాలపై నిషేధం విధించాలనుకోవడం సిగ్గుచేటని జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొక్క శేఖర్‌గౌడ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకర్తల కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శేకర్‌గౌడ్ మాట్లాడుతూ యాసంగి నుంచి వరి పంట వేయొద్దని, వరి విత్తనాలు అమ్మే డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు నీటి లభ్యత, భూమి సారాన్ని బట్టి, వాతావరణ అనుకూలతను బట్టి పంటలు చేసుకుంటున్నారని, రైతులకు ఉన్న స్వేచ్ఛ మీద ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారం, వడ్డీ రాయితీలు, సబ్సిడీలు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన రుణమాఫీ, కనీస మద్దతు ధరలకు పంటల కొనుగోలు వంటి చర్యలు చేయకుండా తాము చెప్పిన పంటలే వేయాలని ఆంక్షలు విధించడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా బిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పోరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ వడ్డెబోయిన నర్సింహారావు, సూరంశెట్టి కిషోర్, బచ్చలకూర నాగరాజు, జెర్రిపోతుల అంజనీ, కొప్పుల గోవిందరావు, ఎడవల్లి నాగరాజు, రమేష్, భూక్యా నిన్న నాయక్, సయ్యద్ హుస్సేన్, కళ్ళెం వెంకట్‌రెడ్డి, చంద్రగిరి నగేష్, మంకెన వాసు, దుంప వెంకటేశ్వరరెడ్డి, నల్లమోతు సత్యనారాయణ, బొయిన వేణు, సంపటం నర్సింహారావు, దొన్ వాన్ వెంకట్రావ్, చంద్రశేఖర్, శంకర్ నాయక్, వొరికోళ్ల సైదులు, పందిరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.