Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సీతరాములు
అ 9వరకు అమరవీరుల వర్ధంతి సభలు
నవతెలంగాణ-గుండాల
భూమి కోసం, భుక్తి కోసం, ఈ భారత దేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే మార్గమని పోరాడుతూ రాజ్యం చేతిలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల సర్పంచ్ కోరం సీతరాములు అన్నారు. సోమవారం మండలంలోని గుండాల, ముత్తాపురం, బాటన్ననగర్, కొడవటంచ, గ్రామాలలో కామ్రేడ్ బాటన్న, చండ్ర పుల్లారెడ్డి, ఈసం భీమన్న, జబ్బ రవి స్థూపాల వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు. 1నుండి 9వ వరకు జరిగే అమరవీరుల వర్ధంతి సభలను గ్రామగ్రామాన విస్తృతంగా జరపాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శిక రవి, అరెం నరేష్, వై.వెంకన్న, లాలయ్య, అజ్గర్, కృష్ణన్న, పెంటన్న, సారన్న, రియజ్, హమాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి : మండలంలోని పలు గ్రామాలలో నేటి నుండి 9వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించనున్నట్టు న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు భానోత్ ఊక్లా నాయక్ తెలిపారు. సోమవారము టేకులపల్లిలోని కాచనపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఎర్ర జెండా ఎగురవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భూక్య హర్జ, మల్లికార్జన్, నోములభానుచందర్, రామస్వామి, మంచా సత్యనారాయణ, దళ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి : ఈ నెల 9వరకు జరుగే అమరవీరుల వర్ధంతి సభలను మండలంలోని గ్రామ గ్రామాన జయప్రదం చేయాలని ఎన్డీ కొత్తగూడెం డివిజనల్ కమిటీ నాయకులు బట్టు ప్రసాద్, కొమరం సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మండల పరిధిలోని ఆనంతోగు, మర్కోడు గ్రామాలలో సోమవారం కామ్రేడ్ పూనెం సూరన్న, పాయం లక్ష్మన్న స్థూపాల వద్ద బట్టు ప్రసాద్, తాళ్లపల్లి సాయన్న జెండాలను ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. పీవైఎల్ జిల్లా నాయకులు శేఖర్, మాజీ ఎంపీటీసీ కొమరం హనుమంతరావు, మండల నాయకులు భద్రం, సుభద్ర, జి.రామన్న, సత్యం, వెంకన్న, శ్రీను, నారాయణ, సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.