Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇనిస్ట్యూట్ ప్రారంభ కార్యక్రమంలో
ఎస్ఎంటి శివ కుమార్
నవతెలంగాణ-ఇల్లందు
స్పీడు యుగంలో ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. పేద, ధనిక పిల్ల పెద్దలు అందరి చేతుల్లోనూ నేడు సెల్ ఫోన్ ఉంటోంది. సెల్ఫోన్ అవసరం ప్రతి ఒక్కరికీ కావలసి వస్తోంది. సెల్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయింది. సెల్ఫోన్ వాడకం ఎక్కువ కావటం వల్ల ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుంది. ఈ దశలో సెల్ఫోన్ రిపేరింగ్ సెంటర్లకు కూడా ఆదరణ ఉంటోంది. పెద్ద నగరాల్లో మాత్రమే నేడు రిపేరింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇప్పుడు రిపేరింగ్ ఇన్స్టిట్యూట్ ఇల్లందుకు కూడా వచ్చేసింది. స్థానిక పాత బస్టాండ్లోని ఏటు జేడ్ సెల్ పాయింట్లో సోమవారం హైదరాబాద్లోని ఒక ప్రధాన సెల్ ఫోన్ ఇన్స్టిట్యూట్కు చెందిన అధినేత ఎస్ఎంటి శివ కుమార్ సెల్ఫోన్ ఇనిస్ట్యూట్ను ప్రారంభించారు. విజయవాడకు చెందిన మరో ఇన్స్టిట్యూట్ అధినేత నాని జ్యోతి ప్రజ్వలన చేసారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. బేసిక్ ఎలక్ట్రానిక్ నుండి సెల్ రిపేరింగ్ వరకు నేర్పుతారని అన్నారు. స్వయం ఉపాధి పొందడానికి మంచి అవకాశం అన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు శోభన్, నగేష్ మాట్లాడుతూ ఏజెన్సీ ఏరియాలో తొలిసారిగా ఇన్స్టిట్యూట్ నెలకొల్పడం సంతోషకరమన్నారు. ఏటుజెడ్ సెల్ వరల్డ్ అధినేత, ఇనిస్ట్యూట్ నిర్వాహకులు శ్రీనివాస్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.