Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీజేఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-చండ్రుగొండ
కళ్ళముందే వయస్సుకొచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేనిదని అయినా కూడా కన్న కొడుకు మీద ఉన్న ప్రేమతో గ్రామంలో 30 బల్లలు వితరణ చేయడం అభినందనీయమని తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర నాయకులు తాళ్ళూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఇటీవల డెంగ్యూ జ్వరంతో మృతి చెందిన ఆకుల ధనుష్ పేరు మీద ఆకుల శ్రీనివాస్ దంపతులు గ్రామంలోని అన్ని కూడళ్ల వద్ద ప్రజలు కూర్చోవడానికి సుమారు రూ.60 వేల విలువచేసే 30 సిమెంట్ బల్లాలు వితరణ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాళ్ళూరి వెంకటేశ్వర్లు పాల్గొని బల్లలు వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ బానోత్ పార్వతి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు (బాబు), ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జెట్పి కో ఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.