Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చిట్టితల్లి సేవాసంస్థ అత్యవసర సేవలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
గత మూడు రోజులు నుండి అనారోగ్యంతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం చికిత్స పొందుతూ మృతి చెందిన అనాధ మహిళకు సోమవారం చిట్టితల్లి సేవాసంస్థ ఆద్వర్యంలో అంతిమసంస్కారం నిర్వహించారు. మండల పరిధలోని చిలకల గండి ముత్యాలమ్మ గుడి సమీపంలో అనారోగ్యంతో బాధపడుతున్న అనాధ మహిళను చిట్టితల్లి ఆంబులెన్స్‌లో మూడు రోజుల క్రితం తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందింది. ఆమెకు ఎవరూ ఆసరా లేని అనాధగా గుర్తించిన పోలీస్‌లు శవపంచనామా అనంతరం అశ్వారావుపేట గ్రామ పంచాయతీకి శవాన్ని అప్పగించారు. దీంతో ఈఓ హరిక్రిష్ణ ఆదేశాల మేరకు చిట్టితల్లి సేవాసంస్థ, అంబులెన్స్ ఆద్వర్యంలో, అంబులెన్స్ డ్రైవర్ బాజీ నేతృత్వంలో సాధారణ వ్యక్తులకు నిర్వహించినట్టే సాంప్రదాయాలు ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చల్లా అరుణ, సర్పంచ్ ఆట్టం రమ్య, నారం వారి గూడెం సర్పంచ్ వెంకట ముత్యం, దాసరి సాంబ, ధర్మరాజు, సాయిరాం, రాము, శ్రీను, ధనుష్, స్నేహిత్, చందు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టితల్లి సేవాసంస్థ నిర్వాహకులు, నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం మాట్లాడుతూ... మృతి చెందిన నిరు పేదలు, ఆసరాలేని అనాధలకు అంత్యక్రియలు చేయడానికి చిట్టితల్లి సేవా సమితి, చిట్టితల్లి ఆంబులెన్స్ ఆధ్వర్యంలో నిత్యం అందుబాటులో ఉంటామని తెలిపారు.