Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
కాసాని ఐలయ్య
నవతెలంగాణ-ములకలపల్లి
పోడు సాగుదారుకు తక్షణమే హక్కు పత్రలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఆయన మాట్లాడారు. పోడు భూముల హక్కులు జారీ చేసే విషయంలో రాజకీయ జోక్యం తగదన్నారు. నేటి వరుకు సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న ఎఫ్ఆర్సీ కమిటీలను కొనసాగించాలన్నారు. ఫారెస్టు అధికారులు పోడు భూముల్లో ట్రెంచ్‌లు (కందకాలు) తీయడం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పీసా కమిటీల ద్వారా గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను గుర్తించి హక్కు పత్రలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న ప్రభుత్వ భూమిని తీసుకొని పోడుసాగుదారులకు ఇస్తామని చెప్పడం చూస్తుంటే పేదల మధ్య చిచ్చుపెట్టి సమస్య నుండి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. వెంటనే పోడు సాగు దారులకు అందరికీ పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఏజె.రమేష్, పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, గౌరి నాగేశ్వరరావు, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, రవికుమార్, మధు, రాముర్తి, లక్ష్మీ నర్సు, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.