Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తల్లాడ
మండల పరిధిలోని గూడూరు, రామచంద్రాపురం, మంగాపురం గ్రామాలలో వైరస్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల పొలాలను మంగళవారం తెలంగాణ రైతు సంఘం నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు తాతా భాస్కరరావు మాట్లాడుతూ.. ధరలు పెరగడంతో, కూలి రేట్లు, ట్రాక్టర్ కిరాయిలు, పెరగడం, మందులు అధికంగా వినియోగించడంతో పెట్టుబడులు అధికంగా పెరిగాయన్నారు. దిగుబడులు తగ్గి పెట్టుబడులు రాకపోవడంతో, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 20 శాతం పంట దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. వరిగడ్డి పశువులకు మేతగా పనికిరాదని, గడ్డి కొనాల్సిన పరిస్థితి, తినటానికే బియ్యం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పంటలకు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. దళారులు క్వింటాకు 20 కేజీలు రైతుల నుండి తరుగు తీసి రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారన్నారు. 13 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేలు అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
దొడ్డ రామకృష్ణ, సూరయ్య, కొమ్మినేని రామచంద్ర రావు, బండారి వెంకటేశ్వర్లు, అను బుద్ధి సాగర్, దొడ్డ శ్రీను, సత్తెనపల్లి వేలాద్రి, డేగల రామారావు, పొదిలి వెంకటేశ్వర్లు, రమేష్ తదితర రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు, అయినాల రామలింగేశ్వర రావు, నల్లమోతు మోహన్ రావు, గుంటుపల్లి వెంకటయ్య, షేక్ నన్నే సాహెబ్, షేక్ మస్తాన్, చల్లా నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.