Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగూడెం లీగల్ : అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులను న్యాయ సేవా అధికార సంస్థ కొత్తగూడెం, ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి రామారావు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ సమావేశాల హాలులో ఆజాదీ కా అమృత్ మహౌత్సవంలో భాగంగా జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, కొత్తగూడెం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బి రవీందర్, మణుగూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బి నాగరాజు, కామన్ సర్వీస్ సెంటర్ జిల్లా మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, లైబ్రరీ సెక్రెటరీ ఆరకాల కరుణాకర్, కోశాధికారి మహమ్మద్ సాదిక్ పాల్గొన్నారు.