Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
దేశవ్యాప్తంగా వివిధ వైద్య కళాశాలలలో వైద్య విద్యను అభ్యసించడానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష 'నీట్'లో తమ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి, మెడికల్ సీట్లు సాధించినట్లు హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాం డెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 12న నిర్వహించిన నీట్ పరీక్షకు తమ కళాశాల నుండి 33 మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవగా సోమవారం ప్రకటించిన పరీక్షా ఫలితాలలో ఐదుగురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. తమ విద్యార్ధిని కె.అనుచౌహాన్ ఆల్ఇండియా 360వ ర్యాంక్ సాధించడం తమకెంతో గర్వకారణమన్నారు. జి.నాగరాజు 1857, బి.సాయి గీతిక 2081, కార్తిసాయి భార్గవ్ 16,972, నిషా తరుణ్ణం 19,615 ర్యాంకులు సాధించడం హర్షనీయ మన్నారు. మిగతా విద్యార్ధినీ, విద్యార్థులందరికీ కూడా వివిధ విభాగాలలో సీట్లు సాధించే అవకాశమున్నదని వారు తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంగళవారం హార్వెస్ట్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీరెడ్డి తమ చాంబర్లో అభినందించి, భవిష్యత్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరారు. కళాశాల అధ్యాపక బృందాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు.