Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నీట్- 2021 పరీక్షా ఫలితాలలో ఖమ్మం శ్రీచైతన్య విద్యార్థులు జాతీయ స్థాయిలో, ఖమ్మంలోనే అత్యధికంగా ఇంటర్ మీడియట్తోపాటు 633 మార్కులతో పాటు ఆలిండియా 148, 335, 474, 704, 1169 వంటి 1000 లోపు అత్యుత్తమ ర్యాంకులతో విజయ కేతనం ఎగురువేశారు. ఈ పోటీ పరీక్షలలో కళాశాలకు చెందిన జుూునజు= ూA=Aన 633 మార్కులు, నమృత 572 మార్కులు, నీరజ 568 మార్కులు, సమ్రీన్ 560 మార్కులు, జీఱరఅa జీశీస్త్రy 559 మార్కులు, నహియా ఫరీస్ 543 మార్కులు, కృష్ణవేణి సాత్విక 539 మార్కులు, భవాని 533 మార్కులు, తైసీన్ 529 మార్కులు, ఎల్ భాగ్యలక్ష్మి 520 మార్కులు, అశ్రిత 497 మార్కులు, దినేష్ కార్తిక్ 485 మార్కులు, శృతి 470 అత్యుత్తమ మార్కులతో తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. కోవిడ్ 19 వలన ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో సైతం శ్రీ చైతన్య తన విద్యార్థులు నష్టపోకుండా వెంటనే ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించిందన్నారు. ఇంటర్మీడియట్‌తో పాటు నీట్లో అత్యుత్తమ ర్యాంకులను సునాయసంగా సాధించగలిగామరని తెలిపారు. విద్యాసంస్థల డైరెక్టర్ మల్లెంపాటి విద్య మాట్లాడుతూ.. మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేసి దానికి తగిన అత్యుత్తమ స్థాయి బోధన సిబ్బందిని విద్యార్థులకు కల్పించడం వల్ల తమ విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షలలో ప్రతికూల పరిస్థితులలో సైతం సునాయసంగా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతున్నారని అన్నారు. విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సాయి గీతిక మాట్లాడుతూ.. ఆన్లైన్, లైవ్ కోచింగ్‌తో పాటు ప్రతి రోజు తమ విద్యార్థుల వర్కింగ్‌ను పర్యవేక్షిస్తూ, పరీక్షలు జరుగుతాయో లేదో అనే అయోమయ పరిస్థితులో విద్యార్థులు నిరాశా, నిస్పృహాలకు లోనుకాకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారికి ఎప్పుడూ తోడుగా ఉండడం వల్లనే తమ విద్యార్థులు ఇంటర్‌తోపాటు సులువుగా ఈ విజయాలను సాధించారని తెలిపారు.