Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నీట్- 2021 ఫలితాలలో రెజొనెన్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని కళాశాల డైరెక్టర్స్ ఆర్వి.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు తెలిపారు. జాతీయ స్థాయిలో వివిధ క్యాటగిరిలో రెజొనెన్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారని, వివిధ క్యాటగిరిలలో రెజొనెన్స్ విద్యార్థులు 575 (కొండా యశ్వంత్ శ్రీసాయి విఘ్నేష్), 534 (కె.దివ్య), 523 (రాజ్), 518 (పి.స్వరూప), 515 (యస్.కె. సనోబీర్), 493 (జి. సుమేధశ్రీ), 490 (యాస ఉమేష్ చంద్ర), 478 (జి. లూసిక హాస్య), 476 (ఎ.నాగలక్ష్మీ), 466, 455, 444, 432 వంటి అత్యుత్తమ మార్కులు సాధించి మరోసారి రెజొనెన్స్ కళాశాల కీర్తిని జాతీయ స్థాయిలో అగ్రస్థానాన నిలిపారన్నారు. సాధారణ విద్యార్థులతో ఇంతటి ఫలితాలు సాధించడానికి కారణం కాలేజీ అకడమిక్ ప్రోగ్రాం , లెక్చరర్స్, సరళమైన అత్యుత్తమ బోధన పద్ధతి, సునిశిత పరిశీలన ఇవన్నీ కలిసి ఈ మార్కులు సాధించడానికి తోడ్పడుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. ఈ విజయంలో భాగస్వామ్యులైన అధ్యాపక బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సతీష్, ఎం.భాస్కర్ రెడ్డి, వి.రాంబాబు పాల్గొన్నారు.