Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
వైద్యవిద్యలో ప్రవేశార్ధం జాతీయ స్ధాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన నీట్ - 2021 ఫలితాలలో నగరంలోని న్యూవిజన్ జూనియర్ కళాశాల విద్యార్ధులు తమ ప్రతిభను చాటి జాతీయ స్ధాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల ఛైర్మన్ శ్రీ సి.హెచ్.జి.కె. ప్రసాద్ తెలిపారు. నీట్ - 2021 ఫలితాలలో ఓపెన్ కేటగిరిలో అర్షియా ఫాతిమా 8540 జాతీయస్ధాయి ర్యాంకును కైవసం చేసుకుంది. వివిధ కేటగిరిలలో పి.త్రిష్ణక - 8790వ ర్యాంకు, జి.సాహితి 8790వ ర్యాంకు, పి.నిఖిల చంద్రిక 17973వ ర్యాంకు, బి.సరస్వతి 21028వ ర్యాంకు జాతీయస్ధాయి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 720 మార్కులకుగాను 629, 594, 567, 557, 547 వంటి టాప్ మార్కు లతో జిల్లా టాపర్‌గా న్యూవిజన్ నిల్చిందని తెలిపారు. కరోన కాలంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఆఫ్‌లైన్ క్లాస్‌కు సమానమైన జాతీయస్ధాయి ర్యాంకులు న్యూవిజన్ జూనియర్ కళాశాల సాధించడం జరిగిందని తెలిపారు.కళాశాలను ప్రారంభించిన అనతికాలంలోని ఐ.ఐ.టి- ఆడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్, వంటి జాతీయస్ధాయి ప్రతిష్ఠాత్మకంగా పోటీ పరీక్షల్లో పరిమిత సంఖ్య గల విద్యార్ధులతో జాతీయస్ధాయి ర్యాంకులు, ఉత్తమ మార్కులు సాధిస్తూ జిల్లా స్ధాయిలోనేగాక, రాష్ట్రస్థాయి లోనూ బెస్ట్ జూనియర్ కళాశాలగా న్యూవిజన్ నిల్చిందని తెలిపారు. ఖమ్మం మరియు పరిసర ప్రాంత విద్యార్ధులతో ఐ.ఐ.టి, ఎస్.ఐ.టి, నీట్ వంటి జాతీయస్ధాయి పోటీ పరీక్షల్లో తమ కళాశాల విద్యార్ధులు జిల్లాలో ఇంతకు ముందు ఏ కళాశాల సాధించని ఫలితాలను సాధిస్తూ, జిల్లా అగ్రగామిగా నిల్చిందని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను అందుకు సహకరించిన తల్లిదండ్రులను, అధ్యాపకులను ఆయన అభినం దించారు.
కార్యక్రమంలో న్యూవిజన్ విద్యా సంస్థల ఛైర్మన్ సిహెచ్జికె. ప్రసాద్, డైరెక్టర్ సిహెచ్. గోపిచంద్, కళాశాల డీన్ శ్రీపాటి మాధవరావు, ప్రిన్సిపల్ బ్రహ్మచారి, శ్రీనివాస రావు మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.