Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్‌లు అన్నారు. మంగళవారం సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మూడు బొమ్మల సెంటర్లో గ్యాస్ బండలు, పొయ్యిలతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధర 63 రూపాయలుగా ఉండేదని, ఇప్పుడు 115 రూపాయలకు చేరిందన్నారు. డీజిల్ 53 రూపాయలు ఉండేదని, ఇప్పుడు 110 రూపాయలకు పెంచారన్నారు. గ్యాస్ 450 రూపాయలుగా ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరుకుందన్నారు. ఇలా ధరలన్నీ విపరీతంగా వంద శాతం పెంచారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ధరలు వెంటనే తగ్గించకపోతే ప్రజలను కలుపుకొని ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శివర్గ సభ్యులు వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్కే సైదులు, పత్తిపాక నాగ సులోచన, బండారు వీరబాబు, షేక్ హిమామ్, ఎల్లంపల్లి వెంకట్రావు, శీలం వీరబాబు, సిపిఎం ఖమ్మం త్రీ టౌన్ నాయకులు ఎస్కే ఖాసిం, వేల్పుల నాగేశ్వరరావు, ఎస్కె బాబు, పోతురాజు జార్జి, సారంగి పాపారావు, తదితరులు పాల్గొన్నారు
కల్లూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోలు, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని, వరి సాగుకు అనుమతి ఇవ్వాలని సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు తన్నీరు కృష్ణార్జునరావు, సీపీఎం మండల కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ధరలు రోజురోజుకు పెంచుతూ పేదలకు పెనుభారాలు మోపుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి సాగు చేయొద్దని చెప్పటం సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా మండల కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి, రైతు సంఘం అధ్యక్షులు ముదిగొండ అంజయ్య, సీఐటీయు నాయకులు గంపల శ్రీనివాసరావు, గొర్రెలు మేకల సంఘం కార్యదర్శి బట్టు నరసింహారావు, సామినేని వీరభద్రం, వీ.రామనాథం, తీగుళ్ల బాబు, నాగలి కృష్ణ, రేసు నాగేశ్వరరావు, మెదుగువెంకయ్య, దిరిశాల శ్రీను, మాదల శ్రీను, అలవాల కృష్ణనాయుడు, చందర్రావు, రామకృష్ణ పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న నిరసన
ఖమ్మం : పెంచిన గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా టూటౌన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రమణ గుట్ట ప్రాంతంలో వినూత్న రీతిలో వంటలు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, సీఐటీయూ టూటౌన్ నాయకులు బోడ పట్ల సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి వీరిచే విధంగా గ్యాస్ ధరలను అమాంతం పెంచుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నగరి కంటి కుమారి, నందిపాటి పావని, బీబీ, విజయమ్మ, కృష్ణ వేణి, సుజాత, సుధా, వెంకటమ్మ, చిరంజీవి పాల్గొన్నారు.