Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
మండల కేంద్రమైన బోనకల్ గ్రామానికి చెందిన కంఠసాని హర్షిని ఎంబీబీఎస్ లో సీటు సాధించింది. బోనకల్ గ్రామానికి చెందిన న కంఠసాని అప్పారావు మధిర మండలం మండలం సిరిపురం గ్రామంలో ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యుడిగా పని చేస్తున్నాడు. తాను ఆర్ఎంపి వైద్యుడు కావటంతో తన కూతురు హర్షిని కూడా డాక్టర్ ని చేయాలనే పట్టుదలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో 520 మార్కులు సాధించింది. దీంతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. ఎం బి బి ఎస్ లో సీట్లు సాధించిన హర్షినిని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం జెడ్ పి టి సి మోదుగు సుధీర్ బాబు బోనకల్ సర్పంచ్ బుక్యా సైదా నాయక్ బోనకల్ ఎంపిటిసి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గూగులోతు రమేష్ బోనకల్ సొసైటీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షుడు గుండపనేని సుధాకర్ రావు సిపిఎం బోనకల్ శాఖ కార్యదర్శి తెల్లకుల శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.
గైనకాలజస్ట్ కావాలని ఉంది : హర్షిని
గైనకాలజిస్ట్ కావాలని ఉందని హర్షిని తెలిపింది. తమ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం కష్టపడి నీటిలో సీటు సాధించానని తెలిపింది. గైనకాలజిస్ట్ అయిన తర్వాత పేద ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నదే తన లక్ష్యమన్నారు.