Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, తద్వారా పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఖమ్మం వన్‌టౌన్, మహిళ పోలీస్ స్టేషన్లను, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, రికార్డులను పోలీస్ కమిషనర్ పరిశీలిం చారు. కేసుల వివరాలు, పోలీస్ స్టేషన్లో 14 ఫంక్షనల్ వర్టికల్స్ పనివిధానాన్ని పరిశీలించారు. ఆనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కి వచ్చే బాధితుల పట్ల వివక్ష చూపకుండా అందరికీ సమానంగా న్యాయం అందేలా చూడాలన్నారు. వారి గౌరవం భంగం కలగకుండా మెరుగైన సేవలను అందిం చేందుకు కృషి చేయాలన్నారు. సివిల్ పంచాయతీలు చేయవద్దని ఆదేశించారు.
దీపావళి స్టాల్స్ సందర్శన
నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో దీపావళి సామాగ్రి విక్రయాల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీపీ మంగళవారం పరిశీలించారు. నిబంధ నలు అతిక్రమించి టపాసులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని తెలిపారు. కేటాయించిన స్థలంలోనే వాహనాలు పార్కింగ్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, టౌన్ ఏసీపీ ఆంజనేయులు, సిఐ శ్రీధర్, అంజలి తదితరులు పాల్గొన్నారు.