Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-ముదిగొండ
చిరుమర్రి గ్రామానికి చెందిన యడవల్లి సైదులు గత సంవత్సరం నుంచి అనారోగ్యానికి గురై రెండు కిడ్నీలు చెడిపోయి చికిత్స కోసం ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ''నవతెలంగాణ దినపత్రికలో గతనెల 28న ''దాతల సాయం కోసం ఎదురుచూపు''అనే కథనం ప్రచురితమైంది. దీంతో పలువురు దాతలు స్పందించి సైదులుకు రూ60వేల రూపాయల ఆర్థిక సహయం అందజేశారు. ఇదేకాక ట్విటర్లో ఈ కథనంను చూసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. సైదులుకు వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు.దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌కి, నవతెలంగాణ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.