Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
కమ్యూనిస్టు పార్టీ ఆయుధం వర్గ పోరాటమే నని రాజకీయ విద్యా విభాగం జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్ అన్నారు. మండల పరిధిలోని రావినూతల గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులలో పార్టీ చరిత్ర- విశిష్టత- పద్ధతులు అనే అంశాన్ని బండారు రమేష్ బోధించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడానికే కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందన్నారు. దేశంలో అనేక ప్రాంతాలలో జరిగిన ప్రజా ఉద్యమాలలో సీపీఐ(ఎం) ప్రధాన పాత్ర పోషించిదన్నారు. దేశానికి మొట్టమొదటి సంపూర్ణ స్వాతంత్య్రం రావాలని ప్రతిపాదన చేసిన పార్టీ సిపిఎం మాత్రమేనన్నారు. సిపిఎం దేశవ్యాప్తంగా నిర్వహించిన పోరాటాల ఫలితంగా ఆనాటి ప్రభుత్వాలు అనేక నిర్బంధాలను విధించిన అన్నారు. ఆ నిర్బంధాలను, ఆటంకాలను అధిగమిస్తూ ప్రజల పక్షాన పోరాడుతూ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సిపిఎం బలపడుకుంటూ వచ్చిందన్నారు.
వర్గ పోరాటాల ద్వారా పార్టీ నిర్మాణం : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం
వర్గ పోరాటాల ద్వారానే పార్టీ నిర్మాణం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. పార్టీ నిర్మాణం అనే అంశాన్ని వెంకటేశ్వరరావు బోధించారు. వర్గ ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయని, అందువల్లనే వర్గ పోరాటాలు నిర్వహించాలన్నారు. పార్టీ నిర్మాణం పటిష్ఠగా లేకుండా పార్టీని విస్తరించటం సాధ్యం కాదన్నారు. సిపిఎంలో నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్‌గా గుగులోతు శారత వ్యవహరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చింతల చెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, రావినూతల ఎంపిటిసి కందిమల్ల రాధ, పెద్ద బీరవల్లి, ఆళ్లపాడు సర్పంచులు ఆళ్ల పుల్లమ్మ, మర్రి తిరుపతిరావు, మాజీ ఎంపీపీ చిట్టమూరు నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.