Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
స్థానిక వి.డి.వోస్ కాలనీలోని రెజొనెన్స్ పాఠశాలలోని విద్యార్థులు పండుగకు ఒకరోజు ముందే దీపావళిని ఉత్సాహంగా నిర్వహించారు. పిల్లలు రంగు, రంగుల దుస్తులతో వివిధ రకాల దీపాలను వెలిగించి దీపావళిని దీపాల పండుగగా జరిపారు.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ చిన్నారులకు దీపావళి ప్రాముఖ్యతను, మన ఆచార వ్యవహారాల పట్ల, భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల గొప్పతనాన్ని చిన్నారులకు ఆమె వివరించారు. అంతేకాక దీపావళి పండుగలో బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లలు కాటన్ దుస్తులను మాత్రమే ధరించి టపాసులను జాగ్రత్తగా కాల్చాలని, ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను పిల్లలకు ఆమె తెలిపారు. కార్యక్రమంలో రెజొనెన్స్ డైరెక్టర్స్ ఆర్.వి.నాగేంద్రకుమార్, కె.శ్రీధర్రావ్, ప్రిన్సిపల్ అన్వర్ బేగ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.