Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఉమ్మడి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాంతో పండుగను జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలు పెద్దల సమక్షంలోనే టపాసులు కాల్చేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని మంత్రి పువ్వాడ ఆకాంక్షించారు.