Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయ నిధి నుంచి సహాయం అందిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు వెన్నుదన్నుగా నిలవడంలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రథమ స్థానంలో ఉంటారని ఖమ్మం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ లింగాల కమల్‌రాజ్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం జూబ్లిపురలోని ఎంపీ నామ క్యాంపు కార్యాలయంలో బుధవారం మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు రూ. 27.71 లక్షల చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైతు బంధు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కార్యక్రమంలో ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, చింతకాని ఎంపీపీ కొప్పూరి పూర్ణయ్య, వైస్ ఎంపీపీ గురిజాల హనుమంతరావు, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, ముదిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, పెంట్యాల పుల్లయ్య, వాచేపల్లి లక్ష్మారెడ్డి, మండల పార్టీల కార్యదర్శులు ఎన్నం శ్రీనివాసరెడ్డి, బొడ్డు వెంకట్రామయ్య, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, ప్రొద్దుటూరు సర్పంచ్ రాజేష్, చింతకాని మండల యూత్ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఎ.అజరు, వెంకటాపురం సర్పంచ్ కోటి అనంతరాములు, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంఛార్జీ తాళ్లూరి హరీష్, నామా సేవాసమితి బాధ్యులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.