Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ప్రదర్శన
నవతెలంగాణ - వైరాటౌన్
హైకోర్టు ఆదేశాల మేరకు యాసంగి సీజనులో వరి పంట సాగుకు అవకాశం ఇవ్వాలని, వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వైరా మండలం గన్నవరం గ్రామంలో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ ఆధిపత్య దేశాలు, కార్పోరేట్ సంస్థలు ఒత్తిడికి లొంగి భారత దేశంలో ఆహార ఉత్పత్తుల పంటల సాగుపై ఆంక్షలు, షరతులు విధించడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులను పధకం ప్రకారం అందుబాటులో లేకుండా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, రైతు సంఘం వైరా మండల నాయకులు శీలం వెంకటరెడ్డి, కిలారు శ్రీనివాసరావు, మాగంటి తిరుమలరావు, బాణాల శ్రీనివాసరావు, బాజోజు రమణ, కారుమంచి జయరావు, మద్దెల బాబురావు, గరికపాడు ఎంపిటిసి మాగంటి సుందరమ్మ, పుష్పారాజ్యం, వజ్రమ్మ, వెంకటేశ్వరరెడ్డి, రాంరెడ్డి, గన్నవరం ఉప సర్పంచ్ సుధాకర్, బుగ్గా వెంకటేశ్వర్లు, చిత్తారు నాగరాజు, ప్రభాకర్, పౌలు, బాబు, తదితరులు పాల్గొన్నారు.